Wednesday, August 1, 2018

గాడిద ఎన్నికల్లో గెలిచిన వైనం తెలుసా ??

పిల్లి, కుక్క, పంది... ఇవేమీ ఎన్నికల గుర్తులు కావు. ఎలక్షన్లలో పోటీకి దిగిన అభ్యర్థులే. కాకపోతే మన దేశంలో కాదు... విదేశాల్లో. జంతువులే కాదు... పక్షులను కూడా పోటీకి దింపారు. మరి వీటిని ప్రజలు ఆదరించారా! ఓట్లేశారా! ఇదే కదా మీ డౌట్. ఇలాంటి అనుమానాలేమీ వద్దు. ఈ ఎన్నికల సిత్రాన్నితెలుసుకోండి.మన దేశంలో ఏనుగు, గుర్రం, సింహం, పులి వంటి జంతువులు... పక్షుల్లో కోడి, మొక్కల్లో కంకి, వృక్షాలలో  మర్రి, పుష్పాల్లో కమలం... ఇలాంటి ఎన్నికల గుర్తులెన్నో కామన్. బ్యాడ్ లక్ ఏంటంటే... వీటికి  పోటీ చేసే ఛాన్స్ లేదు. కానీ విదేశాల్లో ఎంచక్కా వీటిని పోటికి దింపుతారు. అలాగని అధికారం వెలగబెట్టడానికి కాదు. సర్కారుపై నిరసన తెలపడానికి. 1938లో రిపబ్లికన్ పార్టీ వాషింగ్టన్ లోని మిల్టన్ స్థానం నుంచి కంచరగాడిదను పోటీకి దింపింది. విచిత్రమేంటే... ఈ గాడిద ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించింది. ఇక అవినీతికి వ్యతిరేకంగా బ్రెజిల్ లోని సావో పాలో నగర పాలక ప్రజలు రగిలిపోయారు. నిరసనగా ఖడ్గమృగాన్ని బరిలోకి దింపారు. అధికారులు ఇదేమీ కుదరదన్నారు. ఓటర్లు మాత్రం క్యూకట్టారు. ఇంకేం ఏ అభ్యర్థికి పడని విధంగా ఖడ్గమృగానికి  లక్ష ఓట్లు పడ్డాయి. అటు అమెరికాలో 1968లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యూత్ ఇంటర్నేషనల్ పార్టీ అడవిపందిని పోటీకి నిలబెట్టింది. కాలిఫోర్నియాలోని సునోల్ నగరానికి గౌరవ మేయర్ గా గతంలో ఓ కుక్క ఎన్నికై 13 ఏళ్లు అధికార పీఠంపై కొనసాగడం విశేషం. ఇక మోరిస్ అనే పిల్లి వరుసగా రెండుసార్లు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి రికార్డుల కెక్కింది. 1997లో అలాస్కాలోని టాకీట్సా నగరానికి మేయర్ గా ఓ పిల్లి ఎన్నికైంది. 2008లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోలీ అనే కుక్క పోటీ చేసింది. ఇక అమెరికాలోని కెంటకీలోని ర్యాబిట్ హాష్ పట్టణానికి ఒక నల్లగొర్రె, టెక్సాస్ లోని లాజిటాస్ పట్టణానికి ఒక బీరు తాగే మేక మేయర్లుగా కొనసాగుతుండడం విచిత్రమే. విదేశాల్లో ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయి.  
ఇది చదవగానే  మన దేశంలో కూడా జంతువులను పోటీకి అనుమతి బాగుంటుందని  అనిపిస్తోంది కదా !!

కర్టసీ టీవీ 5

No comments:

Post a Comment

కవిగా కూడా రాణించిన వాజపేయి !!

గొప్ప తాత్వికునిగా, సౌందర్యోపాసకునిగా, సంస్కృతీ సాంప్రదాయాలను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజెప్పే ప్రబోధకునిగ...