Thursday, August 16, 2018

కవిగా కూడా రాణించిన వాజపేయి !!

గొప్ప తాత్వికునిగా, సౌందర్యోపాసకునిగా, సంస్కృతీ సాంప్రదాయాలను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజెప్పే ప్రబోధకునిగా, సామాజిక న్యాయాన్ని, మతసామరస్యాన్ని కోరుకునే మనిషిగా తన కవిత్వంలో వాజపేయి దర్శనమిస్తారు. ఆయన కవితలు శిల్ప సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
‘‘చెదిరిన స్వప్నాల రోదనను వినేదెవరు?/ గుండెలను చీల్చి వెల్లుబికిన వేదన కన్నీటి రూపు దాల్చినా/ నేను ఓటమిని అంగీకరించను/ పోరుబాట పట్టడం నాకిష్టం./ కాల-కపాలంపై రాస్తూనే ఒరిగిపోతాను./ కొత్త గీతాన్ని ఆలపించి నవశకానికి నాంది పలుకుతాను.’’
"బాధలు రానీ, వ్యధలే కమ్మనీ/ నిప్పులు చిమ్మనీ జ్వాలలు రేగనీ/ ఆగదు నా ప్రయాణం, అడుగు ముందుకుపడనీ/ కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా/ మెడవంచను, తలదించను.
"పుష్యపున్నమిలో మంచి ముత్యం లాంటి ఒక మంచు బిందువు ప్రభవిస్తుంది. జగత్‌ను కనువిందు చేస్తుంది. బాలభానుని లేలేత కిరణాలకే తను కనుమరుగవుతానని తెలిసినా అది అంటుంది. "
స్వతంత్ర భారత రాజకీయాలపై తనదైన ముద్రవేసిన రాజకీయవేత్త, భారత మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి బహుముఖ ప్రజ్ఞాశాలి. విలువలతో కూడిన రాజకీయాలకు, దేశప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన వాజపేయి ఒక ఉదాత్తమైన కవి, ఉపన్యాసకుడు, సిద్ధాంతాలనే ప్రాణంగా భావించిన వ్యక్తి. సాధారణంగా రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు. రాజకీయాలు, సాహిత్య సాధన కూడా అటువంటివే. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ‘కవితల మాట అటుంచి వచనంలో రాయడం కూడా కష్టతరం’ అయిందని ఆయన చమత్కరించారు. 1957లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయిన తర్వాత ఉపన్యాసమే తన అభివ్యక్తీకరణకు ప్రధాన సాధనమయిందని తెలిపారు.
వాజపేయి తాతగారు సంస్కృత భాషా పండితులు. తండ్రి కృష్ణ బిహారీ గ్వాలియర్‌, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప కవిగా ప్రసిద్ధులైనారు. ‘జయంతి ప్రతాప్‌’లో ఆయన కవితలు తరచు ముద్రితమై పాఠకులను అలరించేవి. గణేశ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాలలో వారి ప్రసంగాలు అందరినీ అమితంగా ఆకట్టుకొనేవి. ఈ విధంగా వారసత్వంగా సాహిత్య సాధన వాజపేయికి ఒక గొప్పవరంగా లభించింది. నిరాలా, పంత్‌, మహాదేవీవర్మ వంటి ఆ తరం కవులను ఆయన అమితంగా ఆరాధించారు. ఎంతో సున్నిత మనస్కుడైన వాజపేయి అన్యాయాన్ని ఎదిరించేందుకు కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకున్నారు. ఒక రాజకీయవేత్తగా రాణించాలనిగానీ, పెద్ద–పెద్ద పదవులు అధిష్ఠించాలనిగానీ ఆయన ఆ రోజుల్లో ఆకాంక్షించలేదు. భారతీయ జనసంఘ్‌ పట్ల ప్రవృత్తిపరంగా ఆకర్షితులు గావటం, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రికల్లో కొన్నేళ్ళు పనిచేయటం, కాంగ్రెసేతర నాయకులతో పరిచయాలు ఆయనను రాజకీయాల్లోకి నెట్టాయి.
రాజకీయ జీవితంలో తలమునకలుగా ఉన్నప్పటికీ వాజపేయి తన సాహిత్య సాధనను విడిచిపెట్టలేదు. కవిగా, సంపాదకునిగా వారి పది రచనలు గ్రంథస్థం చేయబడ్డాయి. వాజపేయి కవితలు ‘మేరీ ఇక్యావన్‌ కవితాయేష’ శీర్షికతో ప్రచురణకు నోచుకున్నాయి. మనసున్న కవిగా వాజపేయి తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి, పలు వర్గాల ప్రజల వెతలను అర్థం చేసుకొని శ్రామిక, పీడిత జనశ్రేయస్సే లక్ష్యంగా కవితా సాధన చేయటం గమనార్హం. ‘తాజ్‌మహల్‌’ ఈయన ప్రథమ కవిత. ఈ కవితలో తాజ్‌మహల్‌ సౌందర్యాన్ని వర్ణిస్తూనే, తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల కన్నీటివెతలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రించిన ఈ కవి తన ఆశయం శ్రామిక జన సంక్షేమమే అని చాటిచెప్పారు. తన కవితా వస్తువు గురించి చెబుతూ నా కవితలు సామాజిక న్యాయం కోసం జాగృతినొందించే మాతృకలు. పరాజయానికి తావేలేదు. అక్షర సైన్యానికి ఓటమి భయం లేదు, గెలవాలన్న కోరిక తప్ప. కాన్పూర్‌లోని విక్టోరియా కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఆయన దేశభక్తి గీతాలు రాసి, శ్రావ్యంగా ఆలపించి శ్రోతల్లో జాతీయ భావనలను రగుల్కొల్పారు.
వాజపేయి కవితల్లో ‘‘శ్రమయేవ జయతే’’ సందేశం వినిపిస్తుంది. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కవి నమ్మకం. ఎండుటాకులు రాలిన చోట కొత్త చివురు చిగురిస్తుందన్న సత్యాన్ని అందించే యీ కవితల్లో తూర్పు దిక్కున పొడిచిన తొలిపొద్దు కిరణం, ఆశకు సంకేతంగా నిలుస్తుందని కవి భావించారు. తన జీవితంలో ఓటమికి తావులేదని, ఆశల సౌధంపై విజయకేతనం ఎగురువేస్తానంటూ ఆయన వ్రాశారు.
వాజపేయితో రచయితగా సాహచర్యం సన్నిహితత్వం నా అదృష్టం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి గారితో కలిసి పార్లమెంటు లాబీలలో, వరండాలో ప్రధానమంత్రి నివాసంలోని ‘‘పంచవటి’’ సమావేశ మందిరంలో కలవటం, సి.నా.రె. తన గజల్స్‌ వినిపిస్తుంటే వాజపేయి ఆనందించటం, నేను వాజపేయి గారి కవితలు ఆయనకు వినిపిస్తుంటే ఆయన చిరునవ్వుతో ఆస్వాదించటం నా పురాకృత పుణ్యంగా, నా జీవితం ధన్యంగా నేను భావిస్తాను.
courtesy.... ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Thursday, August 2, 2018

ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా?

ఇది చాలా పెద్ద చర్చే....
ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ విషయం చూయింగ్ గమ్ లాంటి నిత్య నాష్టా .
ఎంత నమిలితే అంత సాగుతుంది.
ఎంత వాగితే అంత కొనసాగుతుంది. ఇంతకీ భారత ప్రభుత్వం ఏమంటుంది?
ప్రభుత్వం లెక్కల ప్రకారం అధికారికంగా దయ్యాలూ, భూతాలూ, శాపాలూ ఉన్నాయా?
ఉన్నాయి!!!
భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా? చేసింది!!! ఎప్పుడు? ఎక్కడ? ఆ సంగతి తెలుసుకోవాలంటే మీరు ‘ భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా? చేసింది!!! ఎప్పుడు? ఎక్కడ? ఆ సంగతి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి

Wednesday, August 1, 2018

ఎవరీ గోబెల్స్? ఏమా కథ ?

గోబెల్స్ ప్రచారం!   
ఈ మాట తరచుగా రాజకీయాల్లో మనకు వినబడుతుంటుంది. అసత్యాలు చెప్పడం,లేని దాన్ని ఉన్నదానిగా చూపించడం గోబెల్స్ ప్రచారం అంటారు . 
హిట్లర్ అనే నియంతను దేవుడిగా ప్రచారం చేయడానికి గోబెల్స్  ఎలాంటి ప్రచారం చేశాడో  కానీ.. ఉన్నవీ లేనివీ కల్పించి, అభూత కల్పనలను జోడించి... పాలకులు మహానుభావులంటూ వక్ర ప్రకటనలతో ప్రజల మెదళ్లకు తుప్పు ఎక్కించే ప్రచార ప్రయత్నాలకు ‘గోబెల్స్ ప్రచారం’ అనే పేరు మాత్రం స్థిరపడిపోయింది.
ఒక వాదనని సృష్టించడంలోనూ,దానిని ప్రచారం చేయడం లోను దానికి  ఒక గొప్పదనం  కల్పించడంలో గోబెల్స్ ప్రతిభా వంతుడు.నలుపుని తెలుపని చెప్పగలడు. మేకను గొర్రెగా...  గొర్రెను  గోవుగా తన ప్రచారంతో మార్చేయగలడు.  తన ప్రచార విధానాలతో నమ్మించ గలడు .
''ఒక చిన్న అబద్ధాని  కంటే పెద్ద అబద్ధానికి విశ్వసనీయత ఉంటుంది ''అన్న హిట్లర్ సూక్తిని గోబెల్స్ విస్తృత పరచి ' మనం రాజ నీతిజ్ఞుడిగా నైనా బతికి చావాలి,లేదా ఓ దుర్మార్గుడిగా నైనా చచ్చి బతకాలి.కానీ చరిత్ర మనల్ని మరచి పోకూడదు '' అని గోబెల్స్ అన్నట్టుగా చరిత్ర చెబుతోంది. 
ఇంతకీ ఏవరీ గోబెల్స్  ??  వివరాల్లోకెళ్లి  చూస్తే ... 
 పౌల్ జోసెఫ్ గోబెల్స్ 1897లో జర్మనీలోని బెర్లిన్ లో జన్మించాడు.బాల్యంలో పోలియో వచ్చింది . మనిషి సన్నగా పొట్టిగా ఉండే వాడు.అంగ వైకల్యంతో ఆత్మ న్యూనతా భావంతో ద్వేషం పెంచు కున్నాడు. అయితే చదువులో మాత్రం ముందుండేవాడు . హేడెల్ బర్గ్ నుంచి ఫిలాసఫీ లో పట్టా పట్టా పుచ్చుకున్నాడు.  తన నెగటివ్ ఆలోచనలతో  ఎదుటి వారిని క్రమంగా ప్రభావితం చేయడంలో దిట్ట. మొదటి ప్రపంచ యుద్ధంలో చేరడానికి వెళ్తే సైనిక అధికారులు అతగాడిని ఎగతాళి  చేశారు.తనలో అంతర్లీనంగా ఉన్న కసి,నేతకు నచ్చినదే రాయడం తో పై అధికారులకు దగ్గరయ్యాడు.ఉత్తర జర్మనీ పార్క్ ఉన్నత నాయకుడు గ్రెగర్ స్ట్రాసార్ కింద కోశాధికారిగా పని చేసి మన్నలను పొందాడు.తరువాత హిట్లరు వద్దకు చేరి ఆయన అభిమానాన్ని సంపాదించాడు . పార్టీని బలోపేతం చేయడంలో హిట్లరుకు మద్దతు కూడగట్టటంలో విజయం సాధించాడు. గోబెల్స్  ప్రతిభను గమనించిన  హిట్లర్ మొత్తం జర్మనీకి ప్రచార వ్యవ హారాలు చూసే భాద్యత అప్పగించాడు.
గోబెల్స్ నాజీల పార్టీలకు చెందిన పత్రికలకు సంపాదకుడిగా పని చేశాడు.హిట్లర్ ఒక్కడే వామ పక్షాల వాదుల నుండి,యూదుల నుండి సమస్యల నుండి గట్టెక్కించగల అవతార పురుషుడన్నాడు.1933లో ప్రచార శాఖకు గోబెల్స్ ను  మంత్రిగా చేశాడు.గోబెల్స్ తన ఆధీనంలోకి వచ్చిన పత్రికలు,రేడియో,నాటక రంగం,సినిమాలు,సాహిత్యం,సంగీతం,లలిత కళలు అన్నిమాధ్యమాలను గరిష్ట స్థాయిలో ఆడుకుని  అసత్య ప్రచారంతో హిట్లరును అవతార పురుషునిగా చేశాడు.సోవియట్ సైన్యాలు జర్మనీలోకి చొచ్చుకొని వచ్చే వరకు తన వాగాడంబరతతో మోసగించి ప్రజల్ని పక్కదోవ పట్టించాడు.చివరికి 1945 ఏప్రిల్ 20న తన ఆరుగురు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు తరువాత భార్య భర్తలు పరస్పరం కాల్చుకుని మరణించారు. మొత్తానికి   గోబెల్స్ తాను అనుకున్నట్టుగానే చరిత్ర కెక్కాడు. 
ఇపుడు ఆ గోబెల్స్ ను ఆదర్శంగా తీసుకుని పలు పత్రికలు , వ్యక్తులు  గిట్టని వారిపై  వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. 

గాడిద ఎన్నికల్లో గెలిచిన వైనం తెలుసా ??

పిల్లి, కుక్క, పంది... ఇవేమీ ఎన్నికల గుర్తులు కావు. ఎలక్షన్లలో పోటీకి దిగిన అభ్యర్థులే. కాకపోతే మన దేశంలో కాదు... విదేశాల్లో. జంతువులే కాదు... పక్షులను కూడా పోటీకి దింపారు. మరి వీటిని ప్రజలు ఆదరించారా! ఓట్లేశారా! ఇదే కదా మీ డౌట్. ఇలాంటి అనుమానాలేమీ వద్దు. ఈ ఎన్నికల సిత్రాన్నితెలుసుకోండి.మన దేశంలో ఏనుగు, గుర్రం, సింహం, పులి వంటి జంతువులు... పక్షుల్లో కోడి, మొక్కల్లో కంకి, వృక్షాలలో  మర్రి, పుష్పాల్లో కమలం... ఇలాంటి ఎన్నికల గుర్తులెన్నో కామన్. బ్యాడ్ లక్ ఏంటంటే... వీటికి  పోటీ చేసే ఛాన్స్ లేదు. కానీ విదేశాల్లో ఎంచక్కా వీటిని పోటికి దింపుతారు. అలాగని అధికారం వెలగబెట్టడానికి కాదు. సర్కారుపై నిరసన తెలపడానికి. 1938లో రిపబ్లికన్ పార్టీ వాషింగ్టన్ లోని మిల్టన్ స్థానం నుంచి కంచరగాడిదను పోటీకి దింపింది. విచిత్రమేంటే... ఈ గాడిద ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించింది. ఇక అవినీతికి వ్యతిరేకంగా బ్రెజిల్ లోని సావో పాలో నగర పాలక ప్రజలు రగిలిపోయారు. నిరసనగా ఖడ్గమృగాన్ని బరిలోకి దింపారు. అధికారులు ఇదేమీ కుదరదన్నారు. ఓటర్లు మాత్రం క్యూకట్టారు. ఇంకేం ఏ అభ్యర్థికి పడని విధంగా ఖడ్గమృగానికి  లక్ష ఓట్లు పడ్డాయి. అటు అమెరికాలో 1968లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యూత్ ఇంటర్నేషనల్ పార్టీ అడవిపందిని పోటీకి నిలబెట్టింది. కాలిఫోర్నియాలోని సునోల్ నగరానికి గౌరవ మేయర్ గా గతంలో ఓ కుక్క ఎన్నికై 13 ఏళ్లు అధికార పీఠంపై కొనసాగడం విశేషం. ఇక మోరిస్ అనే పిల్లి వరుసగా రెండుసార్లు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి రికార్డుల కెక్కింది. 1997లో అలాస్కాలోని టాకీట్సా నగరానికి మేయర్ గా ఓ పిల్లి ఎన్నికైంది. 2008లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోలీ అనే కుక్క పోటీ చేసింది. ఇక అమెరికాలోని కెంటకీలోని ర్యాబిట్ హాష్ పట్టణానికి ఒక నల్లగొర్రె, టెక్సాస్ లోని లాజిటాస్ పట్టణానికి ఒక బీరు తాగే మేక మేయర్లుగా కొనసాగుతుండడం విచిత్రమే. విదేశాల్లో ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయి.  
ఇది చదవగానే  మన దేశంలో కూడా జంతువులను పోటీకి అనుమతి బాగుంటుందని  అనిపిస్తోంది కదా !!

కర్టసీ టీవీ 5

కవిగా కూడా రాణించిన వాజపేయి !!

గొప్ప తాత్వికునిగా, సౌందర్యోపాసకునిగా, సంస్కృతీ సాంప్రదాయాలను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజెప్పే ప్రబోధకునిగ...